చిరు ‘ఖైదీ’కి 37 ఏళ్ళు.. ఆ సూర్యాన్ని ఇప్పటికీ మర్చిపోలేం

చిరు ‘ఖైదీ’కి 37 ఏళ్ళు.. ఆ సూర్యాన్ని ఇప్పటికీ మర్చిపోలేం

Published on Oct 28, 2020 10:55 PM IST

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో అద్భుత చిత్రాలు, సూపట్ హిట్ సినిమాలు, అవార్డులు పొందిన సినిమాలున్నాయి. కానీ వాటన్నింటిలో ‘ఖైదీ’ చిత్రం చాలా చాలా ప్రత్యేకం. ఈ సినిమా విడుదలై నేటికీ 37 ఏళ్ళు పూర్తవుతోంది. 1983 అక్టోబర్ 28న విడుదలైన ఈ సినిమా అప్పటివరకు సాదా సీదా హీరోగా ఉన్న చిరంజీవిని ఒక్కసారిగా యాక్షన్ హీరోను చేసింది. చిరుకు మాస్ ఫాలోయింగ్ మొదలైంది ఆ సినిమాతోనే. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.

అప్పటివరకు తెలుగు సినిమా హీరోకున్న మీటర్, రూల్స్ ఈ సినిమాతో మారిపోయాయి. అందులో సూర్యం పాత్రలో చిరు ఎగ్రెసివ్ పెర్ఫార్మెన్స్ తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేసింది. బ్లాక్ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్ లో చిరు స్క్రీన్ ప్రెజెన్స్ యువతను అమితంగా ఆకట్టుకుంది. సినిమాలోని పోరాట సన్నివేశాలైతే మరొక ఎత్తు. ఆ స్టంట్స్, చిరంజీవిలోని మెరుపు వేగం చూసి ఔరా అన్నారు ఆడియన్స్. పోలీస్ స్టేషన్ ఫైట్ అయితే ఇప్పటికీ ఓ ట్రెండ్ సెట్టర్ అనే అనాలి. ‘ఖైదీ’ పేరు చెబితే ఆ సన్నివేశమే గుర్తొస్తుంది. హాలీవుడ్ హీరో సిల్వస్టర్ స్టాలోన్ చేసిన ‘ఫస్ట్ బ్లడ్’ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రానికి కథ రాయడం జరిగింది. ఈ విజయంతో ఇండస్ట్రీకి కొత్త యాక్షన్ హీరోను పరిచయం చేసిన క్రెడిట్ కోదండరామిరెడ్డిగారికి దక్కింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు