బాలయ్య కోసం.. 45 అడుగుల భారీ కటౌట్..!

balaiah
నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానులు ఏది చేసినా చాలా స్పెషల్‌గా ఉండేలా ప్లాన్ చేస్తారు. తాజాగా బాలయ్య బాబుపై తమ అభిమానాన్ని సరికొత్తగా, భారీ ఎత్తున ప్రకటించుకున్నారు. బాలకృష్ణ హీరోగా కొత్త దర్శకుడు సత్యదేవా దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లయన్’. త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుకను నేడు (ఏప్రిల్ 9న) నిర్వహించనున్నారు.

హైద్రాబాద్‌లోని శిల్పకళావేదికలో ఈ సాయంత్రం ఆడియో ఆవిష్కరణను జరపనున్నారు. ఈ వేదిక వద్ద అభిమానులు బాలయ్య కోసం 45 అడుగుల ఎత్తున్న భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ ఆ స్థాయి ఎత్తున్న ఫ్లెక్సీలు చాలానే ఏర్పాటైనా కటౌట్ మాత్రం అంత పెద్దది ఏర్పాటు చేయలేదు. ఈ వేదిక వద్ద బాలయ్య కటౌట్ ప్రధాన ఆకర్షణగా కనిపిస్తుందనడంలో సందేహం లేదు. ఇక ఈ సాయంత్రం జరిగే వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరవనుండడం విశేషంగా కనిపిస్తోంది. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాను రుద్రపాటి రమణారావు నిర్మించారు.

Exit mobile version