“83” వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ ని చూస్తే మతిపోవాల్సిందే…!

Published on May 28, 2019 12:09 pm IST

1983లో భారత్ కి మొదటి క్రికెట్ వరల్డ్ కప్ అందించిన టీం ఫోటోకి పోజిచ్చారు, సూటు, బూటు వేసుకొని నీట్ గా రెడీఅయిన ఆ టీం ని చూస్తుంటే మతిపోతుంది. అదేంటీ ఎప్పుడో 39ఏళ్ల క్రితం కప్ గెలిచిన టీం ఇప్పుడు ఫోటోలు దిగడమేంటి అని ఆశ్చర్య పడకండి, ఇది రియల్ టీం కాదు, రీల్ టీం.

లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారం గా తెరకెక్కుతున్న మూవీ “83”. కపిల్ గా రణ్వీర్ సింగ్ చేస్తుండగా, మిగతా టీం సభ్యుల పాత్రలలో జీవా,పంకజ్ త్రిపాఠి,అమ్మి విర్క్ ,హార్డీ సంధ్ తదితరులు కనిపించనున్నారు. “83” మూవీలో టీం క్రికెట్ సభ్యులుగా నటించిన యాక్టర్స్ మొత్తం కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియా హల్ చల్ చేస్తుంది. ఫార్మల్ సూట్స్ లో ఉన్న వారి ప్రొఫెషనల్ లుక్ అదుర్స్ అని చెప్పాలి.

సల్మాన్ తో “ఏక్తా టైగర్” వంటి సూపర్ హిట్ కొట్టిన కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తుండగా , రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More