’90ఎంఎల్’లో ఇక రెండు సాంగ్స్ మాత్రమే !

’90ఎంఎల్’లో ఇక రెండు సాంగ్స్ మాత్రమే !

Published on Oct 14, 2019 7:43 PM IST

హీరో కార్తికేయ డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేస్తోన్న కొత్త చిత్రం ’90ఎంఎల్’. కాగా తాజాగా ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్ డేట్ తెలిసింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టాకీ పార్ట్ అంతా పూర్తయిందట. ఇక కేవలం రెండు సాంగ్స్ మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. కాగా త్వరలోనే ఆ రెండు సాంగ్స్ ను ఫారెన్ లో షూట్ చేయనున్నారు. ఇక ఈ సినిమాను నవంబర్ చివరి వారంలో గాని, లేదా డిసెంబర్ మొదటివారంలో గాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘వినింపించుకోరు’ సాంగ్ ప్రోమో ఈ రోజు ఉదయం 11 గంటలకు రిలీజ్ అయింది. సాంగ్ ప్రోమో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఇటీవలే ఈ చిత్ర టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. జేబులో ఎప్పుడు లిక్కర్ బాటిల్ మైంటైన్ చేసే డ్రింకర్ లవర్ గా కార్తికేయ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ చిత్ర ట్యాగ్ కూడా ‘యాన్ ఆథరైజ్డ్ డ్రింకర్’ అని ఉండటం కూడా ఆసక్తి రేపుతుంది. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శేఖర్ రెడ్డి ఎర్రా తెరకెక్కిస్తున్నారు.

కాగా కార్తికేయ సరసన హీరోయిన్ గా నేహా సోలంకి చేస్తుండగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో అలీ, పోసాని, రావు రమేష్, అజయ్, రవి కిషన్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు