లక్కీ లేడీ సమంత, యంగ్ హీరో శర్వానంద్ జంటగా చేస్తున్న చిత్రం 96. విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రలలో తెరకెక్కి ఘనవిజయం సాధించిన 96 తమిళ చిత్రానికి తెలుగు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. కాగా ఈ మూవీ చిత్రీకణ పూర్తయిందని సమాచారం. కొద్దిరోజులుగా హీరో, హీరోయిన్లు ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటుండగా చిత్రీకరణ పూర్తి చేశారట దర్శకుడు. ఇక త్వరలో నిర్మాణాంతర కార్యక్రమాలు మొదలుపెట్టే అవకాశం కలదు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తుండగా తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. 96 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీకి టైటిల్ ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఈ మూవీ చిత్రీకరణ సమయంలో హీరో శర్వానంద్ కి గాయం కావడం జరిగింది. అతని భుజానికి గాయం కారణంతో పూర్తిగా నయం అయ్యేవరకు షూటింగ్ నిలిపివేయడంతో చిత్రీకరణ ఆలస్యం ఐయ్యింది.


