సమంత, శర్వాల ‘జాను’రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది

సమంత, శర్వాల ‘జాను’రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది

Published on Nov 24, 2019 11:00 PM IST

96

గత ఏడాది అక్టోబర్లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తమిళ చిత్రం ’96’ను తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించగా తెలుగు రీమేక్ కోసం శర్వానంద్, సమంతలు జోడీ కట్టారు. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ తెలుగు రీమేక్ ను డైరెక్ట్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ రీమేక్ షూటింగ్ చివరి దశలో ఉంది. దీంతో సినిమా విడుదల తేదీని కన్ఫర్మ్ చేశారు. 2020 ఫిబ్రవరి 7వ తేదీన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలివడాల్సి ఉంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు