
యువ హీరో నిఖిల్, స్వాతి జంటగా రూపొందుతున్న చిత్రం ‘కార్తికేయ’. ఈ సినిమా ఆడియో విడుదలై దాదాపు 40 రోజులు కావొస్తుంది. ఇంకా విడుదలపై ఎటువంటి స్పష్టత రాలేదు. ‘కార్తికేయ’ విడుదల ఎందుకు ఆలస్యం అవుతుంది..? అనే ప్రశ్నకు వివరణ ఇచ్చారు హీరో నిఖిల్.
సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ‘కార్తికేయ’ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్’కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ గ్రాఫిక్స్ వర్క్స్ చేయడానికి చాలా సమయం పడుతుంది. పైగా ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో రూపొందుతుంది. గ్రాఫిక్స్ వర్క్స్ చేయడానికి బాగా టైం తీసుకోవడం వలన సినిమా విడుదలలో జాప్యం జరిగిందని హీరో నిఖిల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం 99% పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయని త్వరలో విడుదల తేది వెల్లడిస్తాం అని నిఖిల్ తెలిపారు.
‘స్వామి రా రా’ సినిమాతో చక్కని విజయాన్ని అందుకున్న నిఖిల్, స్వాతి మరోసారి ఆ మేజిక్ రిపీట్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. చందూ మొండేటి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీత దర్శకుడు. ‘మాగ్నస్ సినీ ప్రైమ్’ బ్యానర్ ద్వారా వెంకట్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.