సూర్య నెక్స్ట్ సినిమా ముందు పెద్ద సవాలే!

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం కరుప్పు/వీర భద్రుడు తనకి సెన్సేషనల హిట్ గా నిలిచి భారీ వసూళ్లు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత తన నుంచి రానున్న క్లాస్ చిత్రం ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ ముందు మాత్రం పెద్ద సవాలే ఉందని చెప్పాలి. నిజానికి చాలా మంది కరుప్పు రిలీజ్ కి ముందు పెద్దగా హైప్ పెట్టుకోలేదు, సినిమా కూడా ఆ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు.

కానీ సీన్ కట్ చేస్తే ఆ సినిమా ఇప్పుడు 300 కోట్ల దగ్గరకి వెళుతుంది. చాలా వరకు సూర్య కంబ్యాక్ ఇచ్చేది వెంకీ అట్లూరితో చేస్తున్న సినిమా తోనే అని అనుకున్నారు కానీ కరుప్పు చిత్రం ఒక సర్ప్రైజ్ గా నిలిచింది. సో దీనితో ఇప్పుడు ప్రెజర్ రివర్స్ అయ్యింది. విశ్వనాధ్ అండ్ సన్స్ హిట్ అవ్వడం కాదు కరుప్పు ని మించి బాక్సాఫీస్ సక్సెస్ కూడా అవ్వాల్సి ఉంది.

ఈ సినిమాపై తెలుగు, తమిళ్ రెండు చోట్లా మంచి బజ్ ఉంది. సో రెండు చోట్లా గట్టి వసూళ్లు వస్తే కరుప్పు టార్గెట్ ని రీచ్ అవ్వొచ్చు. కానీ వెంకీ గత సినిమా ‘సార్’ కి తెలుగులోనే అధికంగా వసూళ్లు వచ్చాయి. తమిళ్ లో తక్కువ వచ్చాయి. సో అలాంటిది ఏమన్నా రిపీట్ అయితే మాత్రం కష్టమే అనుకోవాలి.

Exit mobile version