‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ పై బిగ్ అప్ డేట్ !

Maa-Inti-Bangaaram

సమంత లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ చిత్రం, జూన్ 19, 2026న థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధమవుతోంది. కాగా ఈ చిత్రంపై ఉన్న ఆసక్తిని మరింత పెంచుతూ, చిత్ర నిర్మాతలు ఇప్పుడు ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లోని ప్రఖ్యాత PCX స్క్రీన్‌పై ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. చిత్ర బృందం సమక్షంలో, రేపు సాయంత్రం 4:30 గంటలకు ఈ ట్రైలర్ విడుదల కానుంది.

ఈ సినిమాను దర్శకురాలు నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్‌ బాగా ఆకట్టుకుంది. పట్టుచీర కట్టుకున్న సమంత, తన చేతిలో తుపాకీ పట్టుకుని యాంగ్రీగా కనిపించి ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రాన్ని ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version