ఈ వారం చివర్లో బిజీ బిజీగా టాలీవుడ్

ఈ వారం చివర్లో బిజీ బిజీగా టాలీవుడ్

Published on Mar 13, 2013 8:24 PM IST

Telugu-Film-Industry
వేసవి సీసన్ ప్రారంభానికి అధికారికంగా ఇంకో రెండు వారల దూరంలో వున్నా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రికార్డు మోతాదులో చిన్న బడ్జెట్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయ్యనున్నాయి. అన్నీ అనుకున్నట్టే జరిగితే ఈ వారం చివర్లో 7 సినిమాలు విడుదల కావచ్చు. ఇందులో మహాత్ రాఘవేంద్ర, పియా భాజ్ పై మరియు అర్చనా కవి నటిస్తున్న మాదుర శ్ర్రీధర్ ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ 200 థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకి స్పెషల్ షో గురువారం హైదరాబాద్లో ప్రదర్శించనున్నారు.

మిగిలిన సినిమాల జాబితాలో శ్రీ, అక్ష నటించిన ‘రయ్ రయ్’, జగపతి బాబు, సోనియా అగర్వాల్ నటించిన ‘ఆపరేషన్ దుర్యోధన2’ ఉన్నాయి. ఇవి కాక ‘జగన్’, ‘3జి లవ్’, ‘అలజడి’, ‘దశమి’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆఖరి నిముషంలో సినిమాలను థియేటర్ నుంచి తీసేయడం ప్రస్తుత ట్రెండ్. మరి వీటిల్లో ఎన్ని సినిమాలు ఈ వారంలో విడుదల అవుతాయో చూడాలి. ఇదిలా ఉండగా ఈ వారం చివర నుండీ ‘గుండెల్లో గోదారి’ సినిమా మరో 25 థియేటర్లలో ప్రదర్శింపబడుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు