‘అల వైకుంఠపురములో’ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన దగ్గరనుంచీ చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఇప్పటికే రెండు సాంగ్స్ విడుదలయి.. అవి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. కాగా తాజాగా ఈ సినిమా నుండి స్పెషల్ సర్ ప్రైజ్ అంటూ మూడో సాంగ్ ‘ఓ మై గాడ్ డాడీ…’ సాంగ్ టీజర్ ని విడుదల అయింది. ఈ సాంగ్ టీజర్ లో బన్నీ కుమారుడు అయాన్, కుమార్తె అహాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా బన్నీ ఫోటోను చూస్తూ వాళ్ళు ఫన్నీగా తల బాదుకోవడం, అలాగే చివర్లో అయాన్ వేసిన స్టెప్ కూడా సాంగ్ టీజర్ కి హైలెట్ గా నిలిచింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇప్పటికే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ – బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు. ఇక ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సాంగ్ టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
