“వార్ 2” లో హృతిక్ తారక్ నడుమ క్రేజీ డాన్స్ సాంగ్ ప్లానింగ్!?

“వార్ 2” లో హృతిక్ తారక్ నడుమ క్రేజీ డాన్స్ సాంగ్ ప్లానింగ్!?

Published on Apr 12, 2024 10:09 AM IST


ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ హైప్ లో ఉన్న పలు చిత్రాల్లో మంచి హాట్ టాపిక్ గా వినిపిస్తున్న చిత్రం “వార్ 2” (War 2) కూడా ఒకటి. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నార్త్ టు సౌత్ అన్ని రికార్డ్స్ లెక్కలు తేల్చే పొటెన్షియల్ కలిగినది.

ఇక ఈ సినిమా కోసం తారక్ నిన్ననే ముంబైలో కూడా ల్యాండ్ అవ్వడంతో మరోసారి వార్ 2 పై వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఓ సాలిడ్ బజ్ ఈ సినిమా విషయంలో వినిపిస్తుంది. దీంతో అయితే దర్శకుడు అయాన్ హృతిక్, తారక్ ల నడుమ ఓ క్రేజీ డాన్సింగ్ నెంబర్ ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని డిజైన్ చేయిస్తున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్, హృతిక్ లు డాన్స్ ఏ రేంజ్ లో చేస్తారో టోటల్ ఇండియా తెలుసు. అలాంటిది ఈ ఇద్దరి కలయికలో ఓ సరైన సాంగ్ పడితే యూట్యూబ్ షేక్ అవ్వడం గ్యారెంటీ. మరి ఈ సాంగ్ విషయంలో మరిన్ని డీటెయిల్స్ ఇంకా బయటకి రావాల్సి ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు