“నిశ్శబ్దం” ఓటిటి రిలీజ్ కు డేట్ లాక్..?

Published on Sep 16, 2020 12:30 pm IST

ఈ ఏడాది విధించబడ్డ లాక్ డౌన్ మూలాన ఈ పాటికే విడుదల కావల్సిన ఎన్నో చిత్రాలు సిల్వర్ స్క్రీన్ పై మిస్సయ్యిపోయాయి. వాటిలో ఈ లాక్ డౌన్ పెట్టకముందు జస్ట్ విడుదలకు రెడీ అయిన చిత్రాలే నాలుగైదు ఉన్నాయి. అలాటి చిత్రాల్లో మన దక్షిణాది సూపర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మెయిన్ లీడ్ లో నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం “నిశ్శబ్దం” కూడా ఒకటి.

హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఇపుడు నేరుగా డిజిటల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అలాగే అభిమానులు కూడా ఈ చిత్రాన్ని ఓటిటి లోనే చూసేందుకు ఎక్కువ మొగ్గు చూపుతుండగా తాజా సమాచారం ఒకటి వినిపిస్తుంది. ఈ చిత్రం తాలూకా డిజిటల్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు కొనుగోలు చెయ్యడమే కాకుండా ఒక డేట్ ను కూడా లాక్ చేసినట్టు వినిపిస్తుంది.

ఈ చిత్రాన్ని డిజిటల్ ప్రీమియర్ గా వచ్చే అక్టోబర్ 2 నుంచి అందుబాటులోకి తేనున్నట్టు స్ట్రాంగ్ బజ్. మరి ఈ చిత్రం అప్పుడు అందుబాటులోకి వస్తుందా లేదా అన్నది చూడాలి వరకు ఆగాల్సిందే. ఈ చిత్రంలో మాధవన్ మేల్ లీడ్ లో నటిస్తుండగా షాలిని పాండే, అంజలి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే ఏఈ చిత్రం మొత్తం 5 భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More