“గేమ్ ఛేంజర్” లో చరణ్ డైనమిక్ ఎంట్రీ సీక్వెన్స్?

“గేమ్ ఛేంజర్” లో చరణ్ డైనమిక్ ఎంట్రీ సీక్వెన్స్?

Published on Feb 25, 2024 7:08 AM IST


గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ హీరోయిన్ గా ఇండియన్ జేమ్స్ కామెరాన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా విషయంలో భారీ అంచనాలు నెలకొన్నాయి కానీ ఈ చిత్రం లేట్ అవుతూ వస్తుండడం మాత్రం ఫ్యాన్స్ కి ఒకింత డిజప్పాయింట్ అంశంగా మారుతుంది. అయితే ఈ సినిమా విషయంలో కొన్ని అప్డేట్స్ పరంగా మాత్రం ఫ్యాన్స్ లో ఆసక్తి పెరుగుతుంది.

అలా లేటెస్ట్ గా ఈ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీపై క్రేజీ బజ్ తెలుస్తోంది. ఈ సినిమాలో అయితే రామ్ చరణ్ కోసం శంకర్ తన మార్క్ లో ఒక డైనమిక్ ఎంట్రీ ని అయితే డిజైన్ చేసారని రూమర్స్ వినిపిస్తున్నాయి. చరణ్ పై ఇది వరకే కొన్ని ఐకానిక్ ఎంట్రీ సీక్వెన్స్ లు ఉండగా ఇది తన కెరీర్ లో మరో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంట్రీ సీన్ గా నిలుస్తుంది అని తెలుస్తోంది. మరి ఆ సీన్ ఎలా ఉంటుందో ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. ఇక ఈ భారీ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు