పూరి వీరాభిమాని ఏంచేసాడో చూడండి…!

పూరి వీరాభిమాని ఏంచేసాడో చూడండి…!

Published on Jul 31, 2019 3:50 PM IST

సాధారణంగా స్టార్ హీరోలకు వీరాభిమానులు ఉంటారు. వారు అభిమానించే హీరో కొరకు బ్యానర్లు కట్టడటం,పుట్టిన రోజు నాడు రక్త దానాలు,అన్న దానాలు చేయడం చేస్తుంటారు. ఇంకొందరు ఏకంగా హీరో పేరును శరీరంపై శాశ్వత టాటూగా వేయించుకుంటారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిలేదు. ఐతే ఇందు భిన్నంగా ఓ డైరెక్టర్ ఫోటోని గుండెలపై పచ్చ పొడిపించుకొని ఓ యువకుడు తన అభిమానాన్ని చాటుకున్నాడు.

అసలు విషయంలోకి వెళితే ప్రభాకర్ అనే ఓ యువకుడు డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి వీరాభిమాని. అతడు ఏకంగా పూరి ఫోటోని తన గుండెలపై టాటూ గా వేయించుకొని తన వీరాభిమానాన్ని చాటుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ ఘనవిజయం సాధించడంతో పూరి టీం రెండు తెలుగు రాష్ట్రాలలో ఇస్మార్ట్ శంకర్ ప్రదర్శిస్తున్న థియేటర్లకు వెళ్లి అభిమానులతో కలిసి సెలెబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓ ధియేటర్ దగ్గర ఈ అభిమాని పూరీని కలిసి తన టాటూని చూపించారు. ఈ సందర్భాన్ని ఛార్మి ట్విట్టర్ లో పంచుకున్నారు.

పూరి వీరాభిమాని ఏంచేసాడో చూడండి…!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు