ఒకే నెలలో కమల్ ఫ్యాన్స్ కి డబుల్ భారీ ట్రీట్.?

ఒకే నెలలో కమల్ ఫ్యాన్స్ కి డబుల్ భారీ ట్రీట్.?

Published on Apr 21, 2024 9:00 AM IST

ప్రస్తుతం యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా ఎవర్ గ్రీన్ దర్శకుడు మణిరత్నంతో భారీ చిత్రం “థగ్ లైఫ్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా ఈ సినిమా కాకుండా షూటింగ్ ని తాను కంప్లీట్ చేసిన సినిమాలు రెండు ఉన్నాయి. అది కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు అని చెప్పాలి.

మరి ఆ చిత్రాలు మన తెలుగు నుంచి ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో చేసిన చిత్రం “కల్కి 2898ఎడి”. అలాగే మరో చిత్రం మావెరిక్ దర్శకుడు శంకర్ తో హీరోగా చేసిన “ఇండియన్ 2” మరి వీటిలో ఆల్రెడీ ఇండియన్ 2 సినిమా జూన్ రిలీజ్ అని ఖరారు అయిపోయింది. అలాగే కల్కి కూడా దాదాపు జూన్ లోనే ఉండొచ్చు అని టాక్ వినిపిస్తుంది.

ఒకవేళ ఇది కూడా ఇదే జూన్ లో అయితే మాత్రం కమల్ ఫ్యాన్స్ కి అంతకు మించిన బిగ్గెస్ట్ ట్రీట్ ఉండదు అని చెప్పాలి. రెండు రెండూ భారీ చిత్రాలు దేనికదే పూర్తి భిన్నం, ఇక కమల్ లాంటి నటుడు రెండు బలమైన పాత్రల్లో అంటే ఆ నెలలో మాత్రం ఒక్క అభిమానులకే కాకుండా మూవీ లవర్స్ కి కూడా గ్రాండ్ ట్రీట్ ఖాయం అని చెప్పాలి. మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు