వైరల్: “విశ్వంభర” నుంచి లీక్

వైరల్: “విశ్వంభర” నుంచి లీక్

Published on May 27, 2024 2:04 PM IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష కృష్ణన్ హీరోయిన్ గా చాలా కాలం తర్వాత కలిసి చేస్తున్న భారీ చిత్రమే “విశ్వంభర”. మరి దీనిని దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తుండగా ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే చిరు కూడా చాలా ఏళ్ల తర్వాత ఒక క్రేజీ ఫాంటసీ థ్రిల్లర్ చేస్తుండడంతో ఈ అంచనాలు మరింత పెరిగాయి.

అయితే మేకర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. అయితే ఈ మధ్యలో సినిమా నుంచి ఎలాంటి లీక్స్ రాలేదు. కానీ ఈసారి మాత్రం ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరు సహా, త్రిష పై ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ లా ఇది అనిపిస్తుంది. మొత్తానికి అయితే ఒక ఊహించనిదే మేకర్స్ ఓ రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి.

అయితే ఈ లీక్ ఫోటోలు వంటివి షేర్ చేయడం సరైంది కాదు కాబట్టి పొందుపరచడం లేదు. ఇక ఈ భారీ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న సినిమా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు