‘సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో’ రెండూ పెద్ద సినిమాలే

‘సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో’ రెండూ పెద్ద సినిమాలే

Published on Jan 7, 2020 8:09 PM IST

Sarileru Ala

ఇన్నాళ్ళు సినిమా రన్ టైమ్ అంటే రెండు గంటల 15 నిముషాలు, మహా అయితే రెండు గంటల 20 నిమిషాలే ఉండాలనే నియమాన్ని తప్పకుండా పాటించేవారు చాలామంది దర్శకులు, హీరోలు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రన్ టైమ్ కోసమని ఎడిటింగ్ టేబుల్ మీద సన్నివేశాలని త్యాగం చేసే రోజులు పోయాయి. నిర్భయంగా సినిమాను రెండున్నర గంటల నిడివికి తీసుకొచ్చేస్తున్నారు.

ఈ సంక్రాంతికి విడుదలకానున్న బన్నీ, మహేష్ సినిమాల సంగతే తీసుకుంటే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం యొక్క నిడివి 169 నిమిషాలు అనగా 2:49 గంటలు. అలాగే ‘అల వైకుంఠపురములో’ రన్ టైమ్ 165 నిముషాలు అనగా 2:45 నిముషాలు. రన్ టైమ్ పరంగా రెండూ లెంగ్తీ చిత్రాలే. ఇంత ఎక్కువ నిడివి పెట్టడానికి కారణం సినిమాలో కంటెంట్ ఉందనే నమ్మకమే. ప్రేక్షకులు సైతం సినిమాలో విషయముంటే మూడు గంటలైనా థియేటర్లలో కూర్చోవడానికి ఇబ్బంది ఫీలవ్వట్లేదు. ఇది ఒకరకంగా సినిమా మేకింగ్, కంటెంట్లో క్వాలిటీ స్థాయిని పాటించడానికి ఒక కండిషన్ మాదిరి పనిచేస్తుంది కూడ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు