ఓటిటి: నెవెర్ బిఫోర్ నెంబర్ భాషల్లో సూర్య “కంగువ”?

ఓటిటి: నెవెర్ బిఫోర్ నెంబర్ భాషల్లో సూర్య “కంగువ”?

Published on May 19, 2024 12:00 PM IST

తమిళ స్టార్ నటుడు సూర్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “కంగువ” కోసం అందరికీ తెలిసిందే. చాలా కాలం తర్వాత సూర్య సాలిడ్ మేకోవర్ మరియు ప్రయోగాత్మకంగా చేస్తున్న సినిమా కావడంతో తమిళ్ తో పాటుగా మన తెలుగులో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే ఈ చిత్రం పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ హక్కులని ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే. అయితే థియేట్రికల్ గానే ఏకంగా 10 భాషల్లో రిలీజ్ అంటే అంతా షాకయ్యారు. కానీ ఇపుడు ఓటిటి రిలీజ్ సంబంధించి ఓ క్రేజీ టాక్ వైరల్ గా వినిపిస్తుంది.

ఈ సినిమా థియేట్రికల్ గా 10 భాషలలో వస్తే.. ఓటిటిలో మాత్రం నెవెర్ బిఫోర్ నెంబర్ ఏకంగా 30 భాషల్లో అలరించేందుకు వస్తుంది అని తెలుస్తుంది. దాదాపు ఓ భారతీయ సినిమా ఇన్ని భాషల్లో అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి కావచ్చు అని చెప్పాలి. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు