“దేవర” కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.?

“దేవర” కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.?

Published on Jan 24, 2024 10:00 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ డెబ్యూ ఇస్తూ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర”. మరి భారీ ఉన్న ఈ చిత్రం రిలీజ్ కోసం ఇపుడు పలు వార్తలు బాగా వైరల్ గా మారుతున్నాయి. ఇక అనుకున్నట్టుగా ఈ చిత్రం ఈ ఏడాది ఉగాది కానుకగా రావడం దాదాపు అసాధ్యం అని ఇప్పుడు వినిపిస్తుండగా మరి కొత్త డేట్ ఎప్పుడు అనేది ఇప్పుడు బజ్ వినిపిస్తుంది.

దీని ప్రకారం సినిమా ఆగష్టు లో రిలీజ్ కానున్నట్టుగా తెలుస్తుంది. మరి అది కూడా ఆగస్ట్ 15న అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఆల్రెడీ జూన్ రిలీజ్ అంటూ కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయి. మరి వీటిలో ఎప్పుడు సినిమా వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు