ఆశిష్, వైష్ణవి చైతన్య ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ కి సరికొత్త రిలీజ్ డేట్ ఖరారు

ఆశిష్, వైష్ణవి చైతన్య ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ కి సరికొత్త రిలీజ్ డేట్ ఖరారు

Published on Apr 24, 2024 12:00 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ లో డిఫరెంట్ జానర్ చిత్రాలకి మంచి ఆదరణ లభిస్తుంది. దీనితో యంగ్ హీరోలు యంగ్ ఫిల్మ్ మేకర్స్ అంతా కూడా ఎప్పటికప్పుడు ఒక కొత్త పాయింట్ తో ఆడియెన్స్ ని పలకరించేందుకు వస్తున్నారు. అలా యువ హీరో ఆశిష్ మరియు “బేబి” సెన్సేషన్ వైష్ణవి చైతన్య కాంబినేషన్ లో దర్శకుడు అరుణ్ భీమవరపు పని చేయగా ఇది వరకే వచ్చిన టీజర్ గ్లింప్స్ అన్నిటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే మేకర్స్ ఈ సినిమాని ఈ ఏప్రిల్ 25నే రిలీజ్ చేయాల్సి కానీ పలు కరాంలు చేత వాయిదా పడింది. ఇక ఫైనల్ గా ఇప్పుడు సరికొత్త రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనితో ఈ చిత్రం ఈ మే 25 గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనితో ఈ చిత్రం మరో నెల వెనక్కి వెళ్ళింది అని చెప్పాలి. ఓ ఇంటెన్స్ పోస్టర్ తో అయితే ఈ అప్డేట్ ని ఇప్పుడు మేకర్స్ అందించారు. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి, పిసి శ్రీరామ్ లాంటి దిగ్గజ టెక్నీషియన్ లు పని చేయడం విశేషం కాగా నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎక్కడా తగ్గకుండా నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు