పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా ది రాజా సాబ్ తో సంక్రాంతి కానుకగా వచ్చి పలకరించాడు. అయితే ఈ సినిమా తర్వాత తన నుంచి మరిన్ని సినిమాలు రానున్నాయి. ఇక ఆ చిత్రాల్లో సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం సలార్ 2 (Salaar 2) కూడా ఒకటి. ప్రభాస్ లాంటి మాస్ కటౌట్ ని ఎలా చూపించాలో అలా దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించారు. దీనితో సలార్ పార్ట్ 2 పై హైప్ తారా స్థాయిలో ఏర్పడింది.
Salaar 2 Rumors – సలార్ 2 పై వరుస పుకార్లు
చాలా రోజుల తర్వాత సలార్ 2 (Salaar 2) పై ఒక్కసారిగా పుకార్లు మొదలయ్యాయి. ఈ సినిమా నుంచి ఈ జనవరి 25న అలా కొత్త అప్డేట్ అంటూ రూమర్స్ వచ్చాయి కానీ వాటిలో నిజం లేదు అన్నట్టే మళ్ళీ వినిపించింది. కానీ దీనిని మించి మరో షాకింగ్ రూమర్ వచ్చింది.
Fans worried with Salaar 2 – ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సీక్వెల్ ఆగిపోయిందా?
సలార్ (Salaar) అనే సినిమాకి రెబల్ ఫ్యాన్స్ లోనే కాదు పాన్ ఇండియా ఆడియెన్స్ లో కూడా ఒక సెపరేట్ వైబ్ ఉంది. మరి ఇలాంటి సినిమాకి సీక్వెల్ ఉండదు అన్నట్టు ఓ టాక్ నిన్న మొదలు పెట్టారు. ఇది విన్న ఫ్యాన్స్ కి మాత్రం ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది. అయినా ఈ సినిమా ఆగడానికి అసలు స్కోప్ కూడా ఉండదు. ఆల్రెడీ షూటింగ్ కొంతమేర అయ్యింది. పైగా ప్రశాంత్ నీల్ కి ఎంతో ఇష్టమైన సబ్జెక్టు కూడా ఇదే. సో ఫ్యాన్స్ ఊరుకున్నా.. వాళ్లెలాగో ఊరుకోరు కానీ ప్రశాంత్ నీల్ కూడా సలార్ సీక్వెల్ ని వదలడం అనేది జరగని పనే అనుకోవాలి. సో సలార్ 2 ఉండదు అని వదిలిన రూమర్ లో నిజం లేదనే చెప్పొచ్చు.
