ఈ వారం “బిగ్ బాస్” ఎలిమినేషన్ లో ఊహించని ట్విస్ట్..?

Published on Nov 26, 2020 3:00 pm IST

మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 4 ఇపుడు 80 రోజులు దాటి ఫైనల్స్ స్టేజ్ కు అత్యంత చేరువలో ఉంది. ఒక్కో వారాంతం ఒక్కో కంటెస్టెంట్ ఎలిమినేషన్ తో మరింత గ్రిప్పింగ్ గా షో కొనసాగుతుంది. అయితే ఈ వారం ఎలిమినేషన్స్ తర్వాత కూడా కొన్ని ట్విస్టులు చోటు చేసుకున్నాయి.

అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన అవినాష్ ఈ వారాంతం ఎలిమినేట్ అయ్యేందుకు సిద్ధంగా లేడు. తాను మాత్రం ఎవిక్షన్ పాస్ ను సొంతం చేసుకున్నాడు అలాగే ఇక్కడే వోటింగ్ లో కూడా అందరి కన్నా తక్కువలోనే ఉన్నాడని కూడా తెలుస్తుంది.

అందుకే ఈ వారాంతం అసలు ఎలిమినేషన్ నే లేకుండా చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఈ వారం ఎలిమినేషన్ కు స్కిప్ చేసేసి ఆ వచ్చే వారం ఎలిమినేషన్ లో మాత్రం ఖచ్చితమైన ఎలిమినేషన్ ఉంటుంది. దీనితో ఈసారి డిసెంబర్ 20న జరిగే ఫైనల్స్ పై మరింత ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :

More