
ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ అయిన ఫాక్స్ స్టార్ స్టూడియోస్ వారు ఈ మధ్య సౌత్ ఇండియాలోని నిర్మాణ సంస్థలతో కలిసి సినిమాలు చేయడానికి మక్కువ చూపుతున్నారు. ఈ సంస్థ ప్రముఖ దర్శకుడు ఎఆర్ మురుగదాస్ నిర్మాణ సంస్థతో కలిసి ఓ సినిమాని నిర్మించనున్నారు. విక్రమ్, సమంత జంటగా నటించనున్న ఈ సినిమాకి విజల్ మిల్టన్ డైరెక్టర్.
ఈ విషయాన్నీ మురుగదాస్ ట్విట్టర్లో షేర్ చేసుకున్నాడు. ‘ఎఆర్ఎం ప్రొడక్షన్స్ – ఫాక్స్ స్టార్ స్టూడియోస్ కలిసి నిమిన్చానున్న సినిమా ఈ రోజు ప్రారంభం కానుంది. విక్రమ్, సమంత నటించనున్న ఈ సినిమాకి విజయ్ మిల్టన్ డైరెక్టర్. ఇప్పుడే ఫస్ట్ షాట్ తీసామని’ ట్వీట్ చేసాడు.
మురుగదాస్ ఇప్పటికే హిందీ ‘తుపాకి’ రీమేక్ అయిన ‘హాలిడే’ సినిమా షూటింగ్ ని పూర్తి చేసాడు. ఇది కాకుండా ప్రస్తుంతం విజయ్ తో చేస్తున్న ‘కత్తి’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.