హిట్ కాంబినేషన్ నుండి రీమేక్ !

Ram Puri

డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ అనే మూవీ భారీ విజయాన్ని సాధించింది. నిజానికి గత కొన్ని సినిమాలుగా పూరికి సరైన హిట్ లేకపోవడంతో ఇస్మార్ట్ శంకర్ హిట్ ఫుల్ ఎనర్జీని ఇచ్చింది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. పూరి – రామ్ కలయికలో మరో సినిమా రాబోతోందని.. ఈ సినిమా ఓ బాలీవుడ్ రీమేక్ అని తెలుస్తోంది. కాకపోతే మరో ఏడాది సమయం పడుతుందట.

ఇక ప్రస్తుతం పూరి తన తరువాత సినిమాని సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో లైగర్ అంటూ గ్యాంగ్ స్టర్ డ్రామాతో మళ్లీ ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ చిత్రం ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ.. డాన్ గా సునీల్ శెట్టి నటిస్తున్నాడట. అనన్య పాండే హీరోయిన్ గా వస్తోన్న ఈ సినిమాను కరణ్ జోహార్, పూరి, ఛార్మిలు కలిసి నిర్మిస్తున్నారు.

Exit mobile version