అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి వరుస అప్ డేట్స్ రెడీ

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి వరుస అప్ డేట్స్ రెడీ

Published on Mar 26, 2024 9:42 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తి అయింది. ఈ మూవీ పై ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఆగష్టు 15న ఈ మూవీ విడుదల కానుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. విషయం ఏమిటంటే, తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి వరుస అప్ డేట్స్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ముందుగా ఈరోజు ఒక మ్యాగజైన్ కోసం దుబాయ్, అబుదాబిలోని యాస్ మెరీనా సర్క్యూట్‌లో కవర్ షూటింగ్ లో అల్లు అర్జున్ పాల్గొంటున్నారు. ఇక ఈనెల 28న దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో తన మైనపు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. అనంతరం ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 నుండి ఆసక్తికరమైన అప్ డేట్స్ రాబోతున్నాయట. మొత్తంగా ఈ విధంగా ఆయన ఫ్యాన్స్ కి వరుస అప్ డేట్స్ తో మంచి ట్రీట్ లభించనుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు