
ఈ కొత్త సంవత్సరం జనవరి 1న విడుదలైన సెటైరికల్ క్రైమ్ కామెడీ త్రిల్లర్ ‘ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్’ . కధ లో విషయం వున్నా కధనంలో పట్టు లేకపోవడంతో సినిమా నిరుత్సాహపరిచింది. అయితే మేవరిక్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై సెటైరికల్ ఫిల్మ్ గా ప్రచారం చెయ్యడంతో సినిమా పై ఆసక్తి కలిగింది. ఇప్పుడు ఈ చిత్రం త్వరలో హిందీ చిత్ర సీమకు వెళుతోంది.
రాకేష్ శ్రీనివాస్ చెప్పిన మొత్తం స్క్రిప్ట్ విన్న తరువాత, బాగా ఇంప్రెస్ అయిన ప్రముఖ బాలివుడ్ విలక్షణ నటుడు మనోజ్ భాజ్ పాయ్ ‘ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్’ హిందీ చిత్రం లో హీరోగా నటించడానికి ఒప్పుకున్నారు. కథల విషయంలో, తన పాత్రల విషయం లో చాలా సెలక్టివ్ గా ఉండే మనోజ్ భాజ్ పాయ్ ఒప్పుకున్నందుకు డైరెక్టర్ రాకేష్ శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేసారు. ఒక ప్రముఖ బాలివుడ్ ప్రొడక్షన్ కంపెనీ తో చర్చలు జరుగుతున్నాయని రాకేష్ శ్రీనివాస్ తెలిపారు.

