“పుష్ప”లో బన్నీ నుంచి సాలిడ్ ట్రీట్ ఉందా.?

Pushpa

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం దేశ వ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. సో మొత్తానికి మాత్రం తన లేటెస్ట్ సినిమా “పుష్ప” తో వారందరినీ పలకరించేందుకు సన్నద్ధం అవుతున్నాడు. అయితే పాన్ ఇండియన్ సినిమాగా సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

సో ముందు అనుకున్న ప్లాన్స్ తో చాలానే మార్పులు పుష్ప కు జరిగాయని ఆ మధ్య టాక్ వచ్చింది. మరి అందుకు తగ్గట్టు గానే బన్నీ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ ఉండే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. రీసెంట్ గా బన్నీ లుక్స్ ను చూస్తుంటే ఫిజిక్ ను మళ్ళీ టైట్ గానే రెడీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ మధ్యలో పాన్ ఇండియన్ సినిమాగా ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటే బాగుంటుందో..

అలాగే బన్నీ మళ్ళీ సిక్స్ ప్యాక్ బాడీని ప్రిపేర్ చేస్తున్నాడని టాక్ వచ్చింది మరి లేటెస్ట్ గా బన్నీ లుక్స్ చూస్తుంటే బహుశాది కూడా నిజమే అనిపిస్తుంది. మొత్తానికి మాత్రం తన పాన్ ఇండియన్ ఎంట్రీను బన్నీ ప్రిస్టేజియస్ గా తీసుకొని ఈ ఎలిమెంట్ ను కూడా యాడ్ చేస్తే ఆ ఇంపాక్ట్ మరో లెవెల్లో ఉంటుందని చెప్పాలి. మరి బన్నీ నిజంగానే మళ్ళీ షర్ట్ లెస్ గా కనిపిస్తాడో లేదో చూడాలి.

Exit mobile version