“ఆచార్య”లో మెగాఫ్యాన్స్ కు సాలిడ్ ట్రీట్ ఇచ్చే సాంగ్.!

Published on Mar 4, 2021 1:00 pm IST

మన టాలీవుడ్ లో అసలు డాన్స్ అనే పదానికి సరికొత్త ట్రెండ్ ను సృష్టించింది ఎవరన్నా ఉన్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి అనే చెప్తారు అంతా. ఒక్క మాస్ హీరో గానే కాకుండా మైండ్ బ్లోయింగ్ డాన్స్ మూమెంట్స్ తో తెలుగు ఆడియెన్స్ ను థ్రిల్ చేసిన మెగాస్టార్ ఇప్పటికీ కూడా తన గ్రేస్ స్టెప్స్ తో అదరగొడుతున్నారు.

అయితే మరి ఇదే మెగాస్టార్ కు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోడయితే ఎలా ఉంటుందో “ఖైదీ నెంబర్ 150″లో మెగా ఫ్యాన్స్ రుచి చూసారు. కానీ దానికి డబుల్ ట్రిపుల్ హై ఇచ్చే సాంగ్ “ఆచార్య”లో ఉన్నట్టుగా టాక్. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ మెగా ఫ్యాన్స్ కు సాలిడ్ ట్రీట్ ఇచ్చే సాంగ్ ను ప్లాన్ చేసారని తెలుస్తుంది.

ఇందులో చిరు మరియు చరణ్ లు వేసే స్టెప్స్ కూడా అంతకు మించే ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మణిశర్మ ఇచ్చిన ట్యూన్ కూడా ఫీస్ట్ లా ఉంటుందని అంటున్నారు. అలాగే మరో పక్క ఈ సినిమా ఆల్బమ్ పై కూడా కాస్త బజ్ కూడా మొదలయ్యింది. వేచి చూడాలి మరి చిరు మణిశర్మ కాంబో మళ్ళీ ఎలాంటి మ్యాజిక్ ను రిపీట్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :