‘ఆదర్శకుటుంబం’ కోసం ప్రత్యేక పాట ?

‘ఆదర్శకుటుంబం’ కోసం ప్రత్యేక పాట ?

Published on Apr 13, 2026 2:02 PM IST

Adarsha-Kutumbham

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న ‘ఆదర్శకుటుంబం’ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ అనంతరం.. ఓ సాంగ్ ను షూట్ చేయనున్నారు. ఇది ప్రత్యేక పాట అని, ఈ పాటలో వెంకటేష్ సరసన మరో బ్యూటీ కనిపిస్తోందని టాక్. మరి ఈ సాంగ్ ఎంత గ్రాండ్ గా ఉండబోతుందో చూడాలి. కుటుంబ విలువల నేపథ్యంలో సాగే ఈ కథలో నారా రోహిత్ నెగటివ్ షేడ్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు.

ఇక నాణ్యత విషయంలో త్రివిక్రమ్ ఎక్కడా రాజీ పడటం లేదు. అనుకున్న సమయానికే సినిమాను పూర్తి చేసి వేసవి వినోదాన్ని అందించాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. అన్నట్టు త్రివిక్రమ్‌, వెంకటేశ్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ తదితర చిత్రాలకు రచయితగా పని చేశారు. ఈ కాంబినేషన్‌లో మూవీని ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా నిర్మాణ సంస్థ హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతుంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు