‘జనవరి 12 విడుదల’ కోసం స్పెషల్ సాంగ్ ?

‘జనవరి 12 విడుదల’ కోసం స్పెషల్ సాంగ్ ?

Published on Aug 23, 2026 9:00 AM IST

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరక్కిస్తున్న సినిమా పై కొత్త అప్ డేట్ వినిపిస్తోంది. వచ్చే నెల మొదట వారంలో వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరణకు మూవీ యూనిట్ ప్లాన్ చేసిందట. ఈ సాంగ్ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సాంగ్ లో విజువల్స్ అద్భుతంగా ఉంటాయట. పైగా కళ్యాణ్ రామ్ – వెంకటేష్ లతో పాటు ఇద్దరు హీరోయిన్స్ కూడా స్టెప్స్ వేయనున్నారు.

కాగా ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సాహు గారపాటి నిర్మాణంలో రానున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే మూడు ట్యూన్స్ కూడా రెడీ చేశాడట. కాగా ఇక ఈ చిత్రానికి ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో వెంకీ కనిపిస్తారట.. ఈ లుక్ కి పూర్తి భిన్నంగా కళ్యాణ్ రామ్ లుక్ ఉంటుందని తెలుస్తోంది. పైగా స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. ఇక నవంబర్ లోపు ఈ సినిమా షూట్ పూర్తి చేయాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు.

తాజా వార్తలు