‘ప్యారడైజ్’ నుంచి మోహన్ బాబు బర్త్ డే ట్రీట్.. శ్రీకాంత్ ఓదెల మాస్ ప్రామిస్

The Paradise

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రమే ది ప్యారడైజ్. తను పరిచయం చేసిన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ భారీ సినిమాలో విలన్ గా విలక్షణ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే. తన రోల్ నుంచి ఆ మధ్య వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా బ్లాస్టింగ్ ట్రీట్ ని అందించింది. ఇక లేటెస్ట్ గా మోహన్ బాబు బర్త్ డే కానుకగా వదిలిన బర్త్ డే మేకింగ్ టీజర్ తో మోహన్ బాబు అంటే ఏంటో చూపిస్తున్నారు.

తన క్రేజీ మేకోవర్ మొదలు అసలు ఆ రోల్ కి తను ఎలా ఒప్పుకున్నారు అనేది మోహన్ బాబు తెలిపారు. అంతేకాకుండా శ్రీకాంత్ ఓదెల కూడా ఒక మాస్ ప్రామిస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఉన్న జెనరేషన్ కి అసలు మోహన్ బాబు గారు అంటే తెలీదు. నేను చూపిస్తాను అంటూ తెలిపాడు. దీనితో తాను ఏ లెవెల్లో మోహన్ బాబుని ప్రెజెంట్ చేయనున్నారో అర్ధం చేసుకోవచ్చు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version