“మాస్ట్రో”తో మరో గిఫ్ట్ రెడీ చేసిన నితిన్.!

“మాస్ట్రో”తో మరో గిఫ్ట్ రెడీ చేసిన నితిన్.!

Published on Mar 30, 2021 12:04 PM IST

ప్రస్తుతం యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “రంగ్ దే” చిత్రంతో ఈ సారి బర్త్ డే ను ఎంజాయ్ చేస్తున్నాడు. మరి అలాగే ఈరోజు తన బర్త్ డే సందర్భంగా తాను నటిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ చిత్రం “మాస్ట్రో” నుంచి ఫస్ట్ లుక్ మరియు టైటిల్ రివీల్ అయ్యింది. బాలీవుడ్ హిట్ చిత్రం “అంధ దూన్” కు రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పుడు మేకర్స్ మరో గిఫ్ట్ ను ప్లాన్ చేసారు.

ఈ చిత్రం నుంచి ఈరోజు సాయంత్రం ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ వీడియోను 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. అక్కడ సంచలన విజయం నమోదు చేసుకున్న ఈ చిత్రం ఇక్కడ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్నా ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు