షాక్ ఇస్తున్న ఎన్టీఆర్ మహానాయకుడు రన్ టైం !

Published on Feb 16, 2019 8:45 pm IST


ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ చిత్రం యొక్క రన్ టైం షాక్ ఇచ్చింది. కేవలం 2 గంటల 8 నిమిషాల నిడివి తో ప్రేక్షకులముందుకు రానుంది ఈచిత్రం. కాగా మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు రన్ టైం దాదాపు 3 గంటలు ఉండి సినిమా సాగదీసినట్లుగా అనిపించడంతో అంచనాలను అందుకోలేక పోయింది. ఆ సినిమా ఆడకపోవడానికి రన్ టైం కూడా ఒక కారణం కావడంతో ఈ సెకండ్ పార్ట్ లో రన్ టైం తక్కువ ఉండేలా చూసుకున్నారు. మరి ఈ రన్ టైం సినిమాకి అడ్వాంటేజ్ అయ్యేలాగే వుంది.

ఇక ఈ చిత్రం యొక్క ట్రైలర్ ఈ రోజు 5 గంటల 55 నిమిషాలకు విడుదలకానుండడంతో ఇప్పుడు అందరి చూపు ఆ ట్రైలర్ పైనే వుంది. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఈనెల 22 న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :