“ఏ1 ఎక్స్ ప్రెస్” థియేటర్ ఎక్స్ పీరియన్స్ చాలా బాగుంటుందంటున్న నిర్మాతలు!

Published on Mar 2, 2021 6:08 pm IST

ప్రస్తుతం థియేట్రికల్ రిలీజ్ కు రెడీగా ఉన్న మంచి హైప్ చిత్రాల్లో సందీప్ కిషన్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా డెనీస్ జీవం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఏ1 ఎక్స్ ప్రెస్” కూడా ఒకటి. ఈ మార్చ్ 5న గ్రాండ్ గా ఈ సినిమా విడుదల కానుంది. మరి ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్ లో కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్ర నిర్మాతలు విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, దయాపన్నేం తదితరులు పలు ఆసక్తికర విషయాలను ఈ సినిమాపై తెలియజేసారు.

తాము ఈ సినిమా చెయ్యడానికి సందీప్ నే కారణం అని తన 25వ సినిమా అనే కాకుండా తమిళ్ స్పోర్ట్స్ అండ్ మ్యూజికల్ గా కూడా మంచి హిట్ కావడంతో తాను ఈ సినిమా బ్లాక్ చేసాడని వారు తెలిపారు. అలాగే ఈ చిత్రం గార ఏడాది ఏప్రిల్ నాటికే రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశామని కానీ కరోనా ప్యాండమిక్ సడెన్ గా రావడంతో అంతా మారిపోయి ఇప్పుడు వస్తుందని తెలిపారు.

అంతే కాకుండా ఎక్కువగా నిజ జీవితంలో ఉన్న హాకీయే స్టేడియం లలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించమని బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ “చక్ దే”లో కనిపించిన స్టేడియంలో కూడా ఈ సినిమా సీన్స్ తియ్యడం జరిగిందని తెలిపారు. అయితే హాకీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ పై మాట్లాడుతూ..మన జాతీయ క్రీడ హాకీ అయ్యినప్పటికీ ఇండియాలో ఎక్కువగా క్రికెట్ ను చూస్తారని కానీ హాకీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా తప్పకుండా ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది అని గట్టి నమ్మకంతో చెప్తున్నారు.

మరి వీటితో పాటుగా ఈ సినిమా డైరెక్టర్ కు మొదటి సినిమానే అయినా చాలా బాగా క్యారీ చేసారని ఈ సినిమాకు 10కోట్లకు పైగానే బడ్జెట్ అయ్యినట్టు కూడా రివీల్ చేశారు. అయితే ఆ మధ్య అనేక సినిమాలకు వచ్చినట్టు గానే ఈ సినిమాకు కూడా ఓటిటి ఆఫర్స్ అనేకం వచ్చాయని కానీ మేము ఒప్పుకోలేదని చెప్పారు. ఎందుకంటే ఈ సినిమాను తీసిన లొకేషన్స్ ఎమోషన్స్ ఇందులో ఉండే స్పోర్ట్స్ సోల్ అంతా థియేటర్స్ లో ఎక్స్ పీరియన్స్ చేస్తేనే చాలా బాగుంటుంది అని నిర్మాతలు తెలిపారు. మొత్తంగా మాత్రం తమ ప్రాజెక్ట్ అవుట్ ఫుట్ విషయంలో మేకర్స్ సూపర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో తెలియాలి అంటే ఈ మార్చ్ 5 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :