రీసెంట్ గా కోలీవుడ్ నుంచి వచ్చి భారీ సక్సెస్ సాధించిన చిత్రమే ‘డిసి’. లోకేష్ కనకరాజ్ దర్శకుని నుంచి హీరోగా మారి చేసిన ఈ ఇంటెన్స్ యాక్షన్ చిత్రం తనకి ఒక మాస్ వెల్కమ్ అందించింది. అయితే ఈ చిత్రం సక్సెస్ తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువగా కనిపించింది.
ఇలా తెలుగులో లోకేష్ కనకరాజ్ ట్రిపుల్ ఏ, ఏ ఎం బి సినిమాస్ కి వచ్చి తెలుగు ఆడియెన్స్ తో ఆనందం పంచుకోగా ఈ సినిమా సాధించిన సక్సెస్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించనున్న 23వ టీం కేక్ కట్ చేయించి లోకేష్ కనకరాజ్ తో ఆ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకున్నారు.
లోకేష్ నెక్స్ట్ దర్శకునిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో భారీ సినిమా చేయనున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తమ దర్శకుడు హీరోగా సాధించిన సక్సెస్ ని సెలబ్రేట్ చేసి సుభాకాంక్షలు తెలిపారు. దీనితో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
Team #AA23 & @MythriOfficial celebrated the massive success of #DC with @Dir_Lokesh ❤️🔥
Congratulations on the blockbuster success of #DC. Now, it’s time for #AA23 🔥💪🏻 pic.twitter.com/DCdqAhjU9x
— Mythri Movie Makers (@MythriOfficial) August 14, 2026
