రెండో రోజు మంచి బుకింగ్స్ తో “ఆ ఒక్కటీ అడక్కు”

రెండో రోజు మంచి బుకింగ్స్ తో “ఆ ఒక్కటీ అడక్కు”

Published on May 4, 2024 7:01 PM IST

కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆ ఒక్కటీ అడక్కు థియేటర్ల లోకి వచ్చింది. మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మించారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా, స్టార్ రైటర్ అబ్బూరి రవి చిత్రానికి డైలాగ్స్ అందించారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేసిన కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాపై ముందునుండే ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. సినిమా మొదటి రోజు 1.62 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టడం జరిగింది.

అయితే ఇది డీసెంట్ రెస్పాన్స్ అనే చెప్పాలి. రెండో రోజు చాలా ప్రాంతాల్లో మంచి బుకింగ్స్ ను నమోదు చేసుకున్నాయి. రెండో రోజు ఈ చిత్రం మరింత వసూళ్లను రాబట్టనుంది. జామీ లీవర్, కల్పలత, హరి తేజ, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, అనీష్ కురువిల్లా తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు