‘ఆ ఒక్కటీ అడక్కు’ మెలోడియస్ గా ఆకట్టుకుంటున్న ‘హమ్మమ్మో’ సాంగ్

‘ఆ ఒక్కటీ అడక్కు’ మెలోడియస్ గా ఆకట్టుకుంటున్న ‘హమ్మమ్మో’ సాంగ్

Published on Apr 26, 2024 3:30 PM IST


అల్లరి నరేష్ హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా యువ దర్శకుడు మల్లి అంకం దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఆ ఒక్కటీ అడక్కు. ఈ మూవీని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలక నిర్మించగా గోపి సుందర్ సంగీతం అందించారు.

ఇక ఈ మూవీ నుండి నేడు హమ్మమ్మో అనే పల్లవితో సాగే మెలోడియస్ సాంగ్ ని రిలీజ్ చేసారు. భాస్కరభట్ల రచించిన ఈ సాంగ్ ని యశస్వి కొండేపూడి అద్భుతంగా ఆలపించారు. అలరించే లిరిక్స్ తో ఆకట్టుకుంటున్న ఈ లిరికల్ మెలోడియస్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఆ ఒక్కటీ అడక్కు మూవీ మే 3న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు