‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్

‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్

Published on Apr 29, 2024 5:30 PM IST


అల్లరి నరేష్ హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా యువ దర్శకుడు మల్లి అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలకా నిర్మిస్తున్న లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఆ ఒక్కటీ అడక్కు. ఈ మూవీకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ మే 3న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.

మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 1 సాయంత్రం 6 గం.ల నుండి హైదరాబాద్ దస్పల్లా హోటల్ లో గ్రాండ్ గా జరుగనుందని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేసారు. మరి అందరిలో మంచి అంచనాలు కలిగిన ఆ ఒక్కటీ అడక్కు మూవీ రిలీజ్ అనంతరం ఎంతమేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు