‘ఆ ఒక్కటీ అడక్కు’ : అల్లరోడిని విజయం వరించేనా ?

‘ఆ ఒక్కటీ అడక్కు’ : అల్లరోడిని విజయం వరించేనా ?

Published on Apr 27, 2024 9:00 PM IST

అల్లరి నరేష్ హీరోగా యువ దర్శకుడు మల్లి అంకం దర్శకత్వంలో చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలకా గ్రాండ్ గా నిర్మించిన తాజా కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఆ ఒక్కటీ అడక్కు. ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఆ ఒక్కటీ అడక్కు మూవీ మే 3న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.

ఇక తాజాగా పలు ప్రమోషనల్ ఈవెంట్స్ భాగంగా హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ, తప్పకుండా ఈ మూవీ తో మంచి విజయం అందుకుంటాం అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల యాక్షన్ మూవీస్ చేస్తూ వస్తున్న అల్లరి నరేష్, కొంత గ్యాప్ తరువాత ఈ మూవీ ద్వారా కామెడీ జానర్ ఎంచుకున్నారు. ఇక ట్రైలర్ లో మంచి కామెడీ, ఎంటర్టైన్మెంట్ అంశాలు కూడా ఆకట్టుకోవడంతో ఆ ఒక్కటీ అడక్కు సక్సెస్ అందుకునే అవకాశం కనపడుతోందని అంటున్నాయి సినీ వర్గాలు. మరి ఈ మూవీతో ఎంతవరకు నరేష్ విజయం అందుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు