‘అల్లు అర్జున్19’ టైటిల్ రివీల్ కి డేట్ ఫిక్స్ !

‘అల్లు అర్జున్19’ టైటిల్ రివీల్ కి డేట్ ఫిక్స్ !

Published on Aug 12, 2019 6:06 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల్లు అర్జున్’ 19వ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. కాగా తాజాగా ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా టైటిల్ ను ఆగష్టు 15న రివీల్ చేయబోతున్నట్లు చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

ఇక ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి 2020 లో విడుదల అవుతుంది.

కాగా బన్నీతో చేస్తోన్న ఈ సినిమాలో త్రివిక్రమ్ కామెడీ హైలెట్ అయ్యేలా ప్లాన్ చేశాడట. ఎలాగూ త్రివిక్రమ్ తన సినిమాల్లో అద్భుతమైన కామెడీ ఉండేలా చూసుకుంటాడు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం బన్నీకి – వెన్నెల కిషోర్ కి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగా నవ్విస్తాయని.. అలాగే సెకెండాఫ్ లో ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సీక్వెన్స్ కూడా పగలబడి నవ్వేలా ఉంటుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు