బన్నీ-సుకుమార్ ల మూవీ సెకండ్ షెడ్యూల్ అక్కడే .

బన్నీ-సుకుమార్ ల మూవీ సెకండ్ షెడ్యూల్ అక్కడే .

Published on Feb 26, 2020 1:26 PM IST

అల్లు అర్జున్ తన లేటెస్ట్ మూవీ షూట్ కి సిద్ధం అవుతున్నారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్ర సెకండ్ షెడ్యూల్ కేరళలో మొదలుకానుంది. వచ్చే నెల 13నుండి ఈ చిత్ర షూటింగ్ అక్కడ మొదలుకానుందని సమాచారం. ఇప్పటికే బన్నీ లేకుండా సుకుమార్ ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. సెకండ్ షెడ్యూల్ సైతం ఎప్పుడో మొదలుకావలసి ఉండగా కొన్ని పర్మిషన్స్ కారణంగా లేట్ అయినట్టు తెలుస్తుంది.

సుకుమార్ ఈ చిత్రాన్ని ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. చిత్తూరుకి చెందిన ఊరమాస్ రాయలసీమ కుర్రాడిగా బన్నీ ఈ చిత్రంలో నటించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రంలో బన్నీ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు