కొత్త ఘనతను సొంతం చేసుకున్న రవితేజ సినిమా !
Published on Jun 2, 2018 11:14 am IST


దర్శకుడు శ్రీను వైట్ల, రవితేజల ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. ఇకపోతే ఈ చిత్రం సాంకేతికంగా ఒక ఘనతను సొంతం చేసుకుంది. అదేమిటంటే ఈ సినిమాను రెడ్ మోంస్ట్రో కెమెరా మరియు జిస్ లెన్స్ ఉపయోగించు చిత్రికరిస్తున్నారట.

దీంతో మొట్ట మొదటిసారి 8కే రెజెల్యూషన్లో చిత్రీకరింపడిన ఘనత ఈ సినిమాకు దక్కింది. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగించడం వలన సినిమా విజువల్ గా గొప్ప స్థాయిలో ఉండనుంది. రవితేజ మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాలో స్టార్ కమెడియన్లు శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిశోర్, రఘుబాబు వంటివారు నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook