‘ఆదర్శ కుటుంబం’ నుంచి నారాయణమ్మ !

విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. ఐతే, ఈ చిత్రం విడుదల వాయిదా పడుతుందన్న ఊహాగానాల మధ్య, అక్టోబర్ 2, 2026న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని చిత్ర బృందం మరోసారి స్పష్టం చేసింది. పైగా ఒక ముఖ్యమైన మ్యూజిక్ అప్ డేట్ తో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పుడు ఊపందుకుంటున్నాయి. ఈ చిత్రంలోని మొదటి పాట ‘నారాయణమ్మ’ రేపు విడుదల కానుంది. ఈ పాట ఆల్బమ్‌కు అద్భుతమైన ఆరంభాన్ని ఇస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.

కాగా ఈ సినిమాలో నివేథా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్ మరియు బ్రహ్మాజీ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

Exit mobile version