ఆట మొదలుపెట్టనున్న ఆది !

Published on Jun 2, 2019 8:10 pm IST

తానెప్పుడూ తనను హీరో అనుకోనని, ఒక నటుడిగానే గుర్తింపు పొందడానికి ఇష్టపడతానని చెప్పే ఆది పినిశెట్టి తాజాగా ఒక స్పోర్ట్ డ్రామాకు సైన్ చేయడం జరిగింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాకు పృథ్వి ఆదిత్య దర్శకుడు. ఇందులో ఆది ఒక అథ్లెట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 12వ నుండి మొదలుకానుంది.

బిగ్ ప్రింట్ పిక్చర్స్, పిఎంఎం ఫిలిమ్స్, కట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా కోసం ఆది ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు. ఇందులో హీరోయిన్ ఎవరు, సినిమా రిలీజ్ ఎప్పుడు వంటి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. క‌న్న క‌ల‌ను సాకారం చేసుకోవ‌డానికి తపనపడే ఒక సిన్సియర్ అథ్లెట్ లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు అనేదే చిత్ర కథాంశంగా ఉండనుంది.

సంబంధిత సమాచారం :

More