ప్యార్ మైన్ పడిపోయానేకి వస్తున్న స్పందనకు ఆనందంలో వున్న ఆది

ప్యార్ మైన్ పడిపోయానేకి వస్తున్న స్పందనకు ఆనందంలో వున్న ఆది

Published on May 10, 2014 10:55 AM IST

Pyar-Mein-Padipoyane
తాను నటించిన ప్యార్ మైన్ పడిపోయానే సినిమాకు వస్తున్న స్పందన చూసి ఆది ఆనందంగా వున్నాడు. ఈరోజు విడుదలైన ఈ సినిమాను ప్రేక్షకులతో పాటు ఆది కూడా హైదరాబాద్ లో చూసారు. సినిమాకు సూపర్ డూపర్ ఓపెనింగ్స్ వచ్చాయి.. అందరికి ధన్యవాదాలు అని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు

ఈ సినిమాలో శన్వి హీరోయిన్ గా నటించింది. రవికుమార్ చావలి దర్శకుడు. ఆది సంగీతదర్శకుడిగా, శన్వి సింగర్ గా ఈ సినిమాలో నటించారు. ఒక వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆది మాట్లాడుతూ “ప్రతీ సినిమా నాకు టెస్ట్ లాంటిది. నన్ను నేను నిరువుపించుకోవాలి. నాకంటే మా నాన్నగారే నా సినిమా గురించి ఎక్కువ టెన్షన్ పడుతున్నారు” అని తెలిపాడు

ఆది తదుపరి సినిమా గాలిపటం అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. నవీన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఎరికా హీరోయిన్. ఈ ఏడాదిలో ఈ సినిమా విడుదలకానుంది

తాజా వార్తలు