ఆది కొత్త సినిమాకు ముహూర్తం ఖరారు !

వినాయకుడు, కేరింత సినిమాలతో దర్శకుడిగా మారిన సాయికిరణ్ అడవి కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నాడు. సాయికుమార్ అబ్బాయి ఆది హీరోగా సాయికిరణ్ అడవి డైరెక్ట్ చెయ్యబోతున్న సినిమా మర్చి 7న ప్రారంభం కానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమాలో నటించబోయే నటీనటుల వివరాలు తెలియాల్సింది ఉంది.

ఆది ప్రస్తుతం విశ్వనాధ్ ఆరిగేల అనే నూతన దర్శకుడి సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చెయ్యబోతున్నారు. ఫ్యామిలి ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందింది. ఆది తాజాగా నెక్స్ట్ నువ్వే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Exit mobile version