‘శంబాల’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న యువ కథానాయకుడు ఆది సాయికుమార్, ఇప్పుడు ‘జంగిల్’ అనే హారర్ థ్రిల్లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో గ్లామరస్ హీరోయిన్ వేదిక కథానాయికగా నటిస్తున్నారు. సరికొత్త కథనం, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్రయూనిట్ తెలిపింది.
ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్, శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులన్నింటినీ ‘ఫ్రైడే పిక్చర్స్’ అధినేత రాఘవ రెడ్డి పబ్బతి సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా, వీఎఫ్ఎక్స్ (VFX) పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇందులో ఆది సాయికుమార్ పాత్ర వైవిధ్యంగా ఉండనుందని, వేదిక పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని నిర్మాతలు తెలిపారు. హారర్, సస్పెన్స్ అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ సినిమాను త్వరలోనే గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్, ట్రైలర్ ను విడుదల చేసి వరుస అప్డేట్స్ ఇవ్వనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
