సమీక్ష : “ఆదికేశవ” – రొటీన్ గా సాగే రెగ్యులర్ యాక్షన్ డ్రామా

సమీక్ష : “ఆదికేశవ” – రొటీన్ గా సాగే రెగ్యులర్ యాక్షన్ డ్రామా

Published on Nov 25, 2023 3:04 AM IST
Adikeshava Movie Review in Telugu

విడుదల తేదీ : నవంబర్ 24, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, అపర్ణా దాస్, రాధికా, సదా తదితరులు

దర్శకుడు : శ్రీకాంత్ ఎన్. రెడ్డి

నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య

సంగీతం: జివి ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫీ: డడ్లీ

ఎడిటర్: నవీన్ నూలి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు ఎన్ శ్రీకాంత్ రెడ్డి తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ చిత్రం “ఆదికేశవ”. మరి ఈరోజు థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే..రాయలసీమకి చెందిన అత్యంత క్రూరుడు చెంగారెడ్డి(జోజు జార్జ్). తన మైనింగ్స్ లో చిన్న చిన్న పిల్లలను పనికి పెట్టి తన ఊరినే హింసిస్తూ ఉంటాడు. అలా మరోపక్క బాలు(పంజా వైష్ణవ్ తేజ్) హైదరాబాద్ లో కొన్ని సీరియస్ గొడవలు పడుతూ ఉద్యోగం లేకుండా తిరుగుతూ ఉంటాడు. ఓ రోజు తన తల్లి(రాధికా) కోరిక మేరకు ఎర్తి కాస్మటిక్స్ అనే కంపెనీలో ఆ కంపెనీ సీఈఓ అయినటువంటి చిత్ర(శ్రీలీల) ని మొదటి చూపు లోనే ప్రేమించి అక్కడే జాయిన్ అవుతాడు. ఇక అక్కడ నుంచి కథ ఎలా మలుపు తిరిగింది? వీరికి ఆ చెంగారెడ్డికి ఏమన్నా కనెక్షన్ ఉందా? ఉంటే అది ఎంతవరకు వెళ్ళింది? చెంగారెడ్డి అక్రమాలను బాలు ఎందుకు అడ్డుకోవాల్సి వస్తుంది అనేది తెలియాలి ఈ సినిమా చూడాలి.

 

ప్లస్ పాయింట్స్ :

 

యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సారి ఓ ఫుల్ మాస్ రోల్ లో కనిపించి ఇంప్రెస్ చేస్తాడు అని చెప్పాలి. ఓ మాస్ హీరోగా కూడా తాను బాగానే ఫిట్ అయ్యి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్షన్ లో అయితే తాను ఆకట్టుకుంటాడు.

అలాగే హీరోయిన్ శ్రీలీల కూడా మంచి లుక్స్ అండ్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సాంగ్స్ లో వీరిద్దరి ఎనర్జీ కూడా బాగుంది. ఇంకా కొన్ని సీన్స్ లో అక్కడక్కడా కామెడీ కూడా బావుంది.

ఇక యాక్షన్ ఎలిమెంట్స్ కి వస్తే మేకర్స్ మొదటి నుంచి చెప్తున్నట్టుగా కొత్తరకం వైలెన్స్ నే చూపించాడు. మాస్ లో కాస్త కొత్తరకం యాక్షన్ అంశాలు కోరుకునేవారికి ఆదికేశవలో మాస్ ఎలిమెంట్స్ మరియు ఫైట్స్ మెప్పించవచ్చు.

అలాగే నటుడు జోజు జార్జ్ విలన్ గా సెట్ అయ్యారు. మంచి నటన కూడా కనబరిచారు. ఇంకా రాధికా, సుమన్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో ప్రధాన బలహీనత అసలు సరైన కథ కథనాలు లేకపోవడం అని చెప్పాలి. మాస్ మూమెంట్స్ బాగున్నప్పటికీ వాటికి అనుగుణంగా కనిపించే కథా కథనాలు నీరస పరుస్తాయి. ఇప్పటికే చాలా సినిమాల్లో చూసేసిన అదే రెగ్యులర్ లైన్ ఈ సినిమాలో కూడా ఉంది.

పైగా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు కూడా చాలానే ఈ సినిమా చూస్తున్నంతసేపు గుర్తొస్తాయి. ఇక ఆ ట్విస్ట్ లు కూడా ఏమాత్రం మెప్పించవు. సినిమా చిన్నదే అయినప్పటికీ కొన్ని చోట్ల బోర్ కొట్టిస్తుంది.

ఫస్టాఫ్ ని మెయిన్ ప్లాట్ లోకి తీసుకెళ్లేందుకు పాటలు అవీ పెట్టి ఫోర్స్డ్ గా తెరకెక్కించిన భావన అయితే కలుగుతుంది. ఇక విలక్షణ నటుడు జోజు జార్జ్ కి మరింత స్క్రీన్ స్పేస్ ఇచ్చి ఉంటే బాగుండేది. తన పాత్ర లిమిటెడ్ గానే ఈ సినిమా కనిపిస్తుంది. తన పాత్ర సహా ఇంకా పలు సన్నివేశాలను మరికాస్త బెటర్ గా డిజైన్ చేయాల్సింది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. టెక్నీకల్ టీం లో జివి ప్రకాష్ సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగుంది. సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ పర్వాలేదు. ఫైట్స్ ని బాగా కంపోజ్ చేశారు.

ఇక దర్శకుడు ఎన్ శ్రీకాంత్ రెడ్డి విషయానికి వస్తే..తాను ఈ చిత్రానికి బిలో యావరేజ్ వర్క్ అందించాడు అని చెప్పాలి. కథని ఎలాగో కొత్తది తీసుకోలేదు కనీసం కథనం అయినా కాస్త ఎంగేజింగ్ గా తెరకెక్కించాల్సింది. కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ నే సాలిడ్ గా తెరకెక్కించాలి అని ఫిక్స్ అయ్యారో ఏమో కానీ వాటిని మాత్రం బాగానే ఎలివేట్ చేశారు. అలాగే కొన్ని సన్నివేశాలను ఇంకా బెటర్ గా ప్రెజెంట్ చేయాల్సి ఉంది.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “ఆదికేశవ” చిత్రంలో మెయిన్ లీడ్ ఓకే అనిపిస్తారు. ఆలాగే మంచి మాస్ మూమెంట్స్ కూడా సాలిడ్ గా ఉన్నాయి. కానీ కథ కథనాలు మాత్రం సినిమాలో బలహీనతగా అనిపిస్తాయి. ఫస్టాఫ్ కంటే కొంచెం బెటర్ గా సెకండాఫ్ ఉంటుంది. మరి వీటితో అంచనాలు చాలా తక్కువ పెట్టుకొని అది కూడా మరి కేవలం మాస్ యాక్షన్ లవర్స్ అయితే ఒక్కసారి ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు