పూర్తికావొస్తున్న ఆది ‘గాలిపటం’

aadi-in-rough
యువనటుడు ఆది వెంటవెంటనే చిత్రాలు చేస్తూ బిజీగా వున్నాడు. ఇటివలే విడుదల అయిన ‘ప్యార్ మే పడిపోయమే’ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి మార్కులే సంపాదించింది. ఆది తాజా చిత్రం ‘గాలిపటం’ చిత్రీకరణ దాదాపు పూర్తికావొచ్చింది.

ప్రస్తుతం ఈ చిత్ర నటీనటుల మీద ఒక ప్రమోషనల్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు దీనితో దాదాపు 90 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. ఎరికా ఫెర్నాండెజ్ క్రిస్టినా అఖీవ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘అందాల రాక్షసి’ ఫేం రాహుల్ ఒక ప్రత్యేక పాత్ర పోషించనున్నారు.

‘రచ్చ’ వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సంపత్ నంది ‘గాలిపటం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంపత్ నంది స్నేహితుడు నవీన్ గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భీమ్స్ సెసిర్లో సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి భాస్కర్ బట్ల సాహిత్యం అందిస్తున్నారు.

ఫైనల్ ప్యాచ్ వర్క్ పూర్తయిన తర్వాత ఆడియో మరియు సినిమా రిలీజ్ తేదిలు ప్రకటిస్తారు.

Exit mobile version